స్కూల్ బస్సులకు ఫిట్నెస్ చేయించాలి: ఆసిఫాబాద్ డీటీఒ

70చూసినవారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రైవేటు స్కూళ్ల బస్సులను తనిఖీ చేస్తున్నామని జిల్లా రవాణా శాఖ అధికారి రాంచందర్ తెలిపారు. శుక్రవారం ‌ఆయన‌ మీడియాతో మాట్లాడుతూ. జిల్లాలో 83 బస్సుల్లో 64కు ఫిట్నెస్ చేయించినట్లు చెప్పారు. 19 బస్సులకు చేయించాల్సి ఉందన్నారు. బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఫైర్ సేఫ్టీ వస్తువులు తప్పకుండా కలిగి ఉండాలని సూచించారు. ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్