రెండవ ఏఎన్ఎం ల నోటిఫికేషన్ లో అదనంగా 5వేల పోస్ట్ లను పెంచి, డిసెంబర్ 2 నుండి 28 వరకు ప్రిపరేషన్ హాలిడేస్ ఇవ్వాలని ఏఐటీయుసి కొమురంభీం జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు, గురువారం జిల్లా డిఎంహెచ్ఓ సీతారాంకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చాలి చాలని వేతనాలతో వైద్యం అందించడంలో ఏఎన్ఎంలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు.