కొమురం భీం జిల్లా జైనూర్ మండల కేంద్రం మీదుగా ఉట్నూర్ వైపునకు అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక లారీలను పట్టుకున్నారు. జైనూర్ ఎస్ఐ సందీప్ కుమార్ వివరాల ప్రకారం. సోమవారం స్తానిక అంబేడ్కర్ కూడలి వద్ద జైనూర్ సీఐ అంజయ్య, పోలీసు సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆసిఫాబాద్ నుంచి ఉట్నూర్ వైపు వెళ్తున్న రెండు లారీలు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక లోడ్తో వెళ్తుండగా వాటిని పట్టుకున్నామని ఎస్సై వివరించారు.