సిర్పూర్ నియోజకవర్గంలోని పెంచికల్పేట్ మండల కేంద్రంలోని శనివారం వీరహనుమన్ విగ్రహం దగ్గర ప్రత్యేక పూజలు చేసి జరిగే వీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ కొబ్బరికాయ కొట్టి శోభాయాత్రలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులను ఐక్యంగా ఉంచి సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రతి ఒక్కరూ హిందూ సంప్రదాయాలను గౌరవించాలని ఆయన సూచించారు.