ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలంలోని బస్ స్టాప్ఏరియాలో పోలీస్ బెజ్జుర్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా, ఎస్ఐ కొట్టె ప్రవీణ్ కుమార్ పలువురు ప్రయాణికులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వారు అన్నారు.