కొమురం భీం భాజపా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన ధోని శ్రీశైలంను సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు కాగజ్ నగర్ పట్టణం సర్సిల్క్ లో శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపినారు. ఈ సందర్భంగా డా. పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ జిల్లా భాజపా నాయకులకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, పార్టీని జిల్లాలో, గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి కృషి చేయాలని వారికి సూచించారు.