తెలంగాణ రాష్ట్రసీఎం రేవంత్ రెడ్డి వెంటనే సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కొమురంభీం జిల్లాకేంద్రంలోని ప్రెసైక్లబ్లో విలేకరులతో మాట్లాడారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని 25 రోజులుగా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. దీంతో విద్యార్థుల చదువులు ఆగమవుతున్నాయని పేర్కొన్నారు.