ఆసిఫాబాద్ మండలం రహపల్లి గ్రామానికి చెందిన మైనర్ అమ్మాయికి బాల్య వివాహం జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు శుక్రవారం గ్రామానికి డీసీపీఒ బూర్ల మహేష్ వెళ్లి బంధువులు, కుటుంబ సభ్యులకు బాల్య వివాహం వల్ల ఎదురయ్యే నష్టాలను వివరించి కౌన్సిలింగ్ చేశారు. ఈ సందర్భంగా డీసీపీవో మాట్లాడుతూ.. జిల్లాలో బాల్య వివాహాలు చేస్తే నాన్బెయిలబుల్ కేసులను నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.