వాంకిడి: విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధించాలి: అదనపు కలెక్టర్

72చూసినవారు
వాంకిడి: విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధించాలి: అదనపు కలెక్టర్
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కొమురంభీం జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మంగళవారం వాంకిడి మండలం ఇందాని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మెనూతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్