కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయాలని ఆదివారం ఆదిలాబాద్ ఎంపీ గేడం నగేష్ కు బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. కొమురం భీం జిల్లా ఉన్నత విద్య విషయంలో చాలా వెనుకబడి ఉందని అన్నారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఆపై చదువులకు ఉన్నత విద్యా సంస్థ లేదన్నారు. బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.