ఆసిఫాబాద్ జిల్లా జెండాగూడకు చెందిన మసాదే లక్ష్మి నారాయణను శనివారం తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుతో సత్కరించారు. హైదరాబాద్ లో జరిగిన అవార్డుల వేడుకలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా జ్యూరీ అవార్డును లక్ష్మి నారాయణ అందుకున్నారు. 2024 సంవత్సరానికి సంబంధించిన సినిమా అవార్డుల జ్యూరీ లో ప్రభుత్వం లక్ష్మి నారాయణ ను ఒక మెంబర్ గా నియమించారు.