
కరోనా కొత్త కేసులు 117.. ముగ్గురు మృతి
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 117 మందికి పాజిటివ్‌గా తేలింది. ముగ్గురు మరణించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కేరళలో అత్యధికంగా 2,165 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్లో 1,281, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 731, మహారాష్ట్రలో 615 కేసులు, కర్ణాటకలో 467, ఉత్తరప్రదేశ్‌లో 227 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీటితో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 7,154కి ఎగబాకింది.