కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో హనుమాన్ శోభాయాత్ర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలంతా శాతియుతంగా జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరారు. శోభాయాత్రకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.