గిరిజన సంక్షేమ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని ఆశాఖ ఉపసంచాలకులు ఆర్ రమాదేవి సూచించారు. శుక్రవారం కొమురంభీం జిల్లా కేంద్రంలోని గిరిజనాశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ఆంగ్లంలో పరీక్ష రాయనున్నందున ఉపాధ్యాయులు అందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు.