కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా స్థానిక సమరయోధుడు, దండనాయకులు శ్రీనివాసరావును ముఖ్య అతిథి శాసనమండలి చైర్మన్ డా. బండ ప్రకాష్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన నాటి పోరాట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశా బాబు, అధికారులున్నారు.