వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి పురస్కరించుకుని ప్రభుత్వ కళాశాలలో ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ సురేందర్ పూలే చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతు అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు విద్య, మహిళోద్ధరణకు కృషి చేసిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.