గురువారం వాంకిడి మండలంలోని బెండర గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్నులే నారాయణ అందజేసి, భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవారికి ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాంకిడి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మండో కార్ అనిల్, తదితరులు పాల్గొన్నారు.