వాంకిడి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై, చౌరస్తాలోని వాహనాదారులను ఎస్ఐ ప్రశాంత్ సింహ హెచ్చరించారు. జాతీయ రహదారిపై, చౌరస్తాలో ఇరువైపులా పార్కింగ్ సూచిక కోసం ఏర్పాటు చేసిన గీత దాటితే కఠిన చర్యలు తప్పవని శనివారం హెచ్చరించారు, జాతీయ రహదారిపై ఉన్న మూగజీవులను బంజారా దొడ్డికి తరలించారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాంకిడి పోలీస్ సిబ్బంది ఉన్నారు.