వాంకిడి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బాబాసాహెబ్ అంబెడ్కర్134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ అంటరాని తనం, కుల వివక్ష లపై అలుపెరుగని పోరాటం చేసి, అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి ప్రధాత భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ అన్నారు.