వాంకిడి: రోడ్లపై పశువులు.. వాహనదారుల తిప్పలు.. పట్టించుకోని అధికారులు

74చూసినవారు
వాంకిడి: రోడ్లపై పశువులు.. వాహనదారుల తిప్పలు.. పట్టించుకోని అధికారులు
వాంకిడి మండలంలోని రహదారులు, ప్రధాన చౌరస్తాలో శుక్రవారం రాత్రి పశువులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్లపై వెళ్తున్న వాహనదారులకు అవులు, ఎద్దులు అడ్డంగా రావడంతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో మూగ జీవులు (ఆవులు, ఎద్దులు) విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. ఆకలికి తట్టుకోలేక కూరగాయలు విక్రయించే వారి వద్ద నిలబడి ప్రయాణికులకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. ప్రమాదాలు జరగక ముందే సంబంధిత శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్