కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీని వీడి ఆదివారం డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో వాంకిడి మండలానికి చెందిన పదిమంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ గుర్నూలే నారాయణ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మెంగజీ, తదితరులు పాల్గొన్నారు.