తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె ఎమ్మెల్సీ కవిత వాంకిడి మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన దాబా గ్రామానికి చెందిన విద్యార్థిని శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు సోమవారం విచ్చేస్తున్నారు అని బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి పారుపెల్లి అజయ్ కుమార్ శనివారం తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము అన్నారు.