వాంకిడి: బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేసిన ఎంఈఓ

55చూసినవారు
వాంకిడి: బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేసిన ఎంఈఓ
వాంకిడి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆర్జుగూడలో శుక్రవారం మండల విద్యాధికారి శివ చరణ్ కుమార్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు నటరాజ్, ప్రధానోపాధ్యాయురాలు ధర్మబాయి, సీఆర్పీలు విజయబాబు, సందీప్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఒకటవ తరగతిలో అడ్మిషన్ పొందిన ఐదుగురు విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది.

సంబంధిత పోస్ట్