వాంకిడి: ఆసక్తి గల ఆడపడుచులకు సంక్రాంతి ముగ్గుల పోటీలు

69చూసినవారు
వాంకిడి: ఆసక్తి గల ఆడపడుచులకు సంక్రాంతి ముగ్గుల పోటీలు
వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కన గల గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించబడునని శనివారం దుర్గం ప్రశాంత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆసక్తి గల ఆడపడుచులు ఈ ముగ్గుల పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలన్నారు. ఈ పోటీలో మొదటి బహుమతిగా రూ. 6000, ద్వితీయ బహుమతి రూ. 3000, తృతీయ బహుమతి రూ. 1500, మరియు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సహాక బహుమతి ఇవ్వబడునన్నారు.

సంబంధిత పోస్ట్