మహిళలు ర్యాగింగ్, ఈవ్టీజింగ్, హింసకు గురి అయినట్లయితే కొమురం భీం జిల్లా షీ టీమ్ మొబైల్ నంబర్ 87126 70564 లేదా డయల్ 100 ను సంప్రదించగలరని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. షీటీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పై అవగాహన కార్యక్రమాల ద్వారా జిల్లాలో అవగాహన కల్పిస్తున్నామనీ తెలియజేశారు. పోలీసులకు సమాచారం తెలిపిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అన్నారు.