ఆసిఫాబాద్: మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి: జిల్లా కలెక్టర్

82చూసినవారు
ఆసిఫాబాద్: మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి: జిల్లా కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే అన్నారు. బుధవారం ఇందిరా మహిళా శక్తి పథకం కింద జిల్లా మత్స్య శాఖ ద్వారా రాయితీతో మంజూరైన చేపల సంచార వాహనాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారాంతో కలిసి పరిశీలించారు. ఈ పథకంలో క్యాంటీన్లు, మీ సేవ, పెరటి కోళ్ల పెంపకం, కోళ్ల ఫారంలకు అవకాశం కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్