డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో యువత భాగస్వామ్యం ఎంతైనా ఉందని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు అన్నారు. కొమురంభీం జిల్లా కలెక్టరేట్లో బుధవారం వరల్డ్ డ్రగ్ డే (ప్రపంచ మత్తు పదార్థాల దినం )సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొని మత్తు పదార్థ రహిత సమాజం ఏర్పాటు కోసం కృషి చేయాలని తెలిపారు.