బెల్లంపల్లి: అధిక రక్తపోటుతో గుండె జబ్బులు

58చూసినవారు
బెల్లంపల్లి: అధిక రక్తపోటుతో గుండె జబ్బులు
సింగరేణి కార్మికులకు ఎక్కువగా రక్తపోటుతో గుండె జబ్బులు వస్తున్నాయని బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి టీవైసీఎంవో మధు కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆసుపత్రిలో ప్రపంచ రక్తపోటు దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నూనె పదార్థాలు తగ్గించి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే దీర్ఘకాల వ్యాధులకు ఆదిలోనే అరికట్టవచ్చని పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రత్యేకంగా ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్