బెల్లంపల్లి పట్టణంలోని వంద పడకల ఆసుపత్రి ముందు పార్కింగ్ చేసే వాహనాలకు షెడ్ లేకపోవడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే ప్రజలు ఎండలో వాహనాలు పెడుతూ ఇబ్బందులు పడుతున్నారు. వర్షకాలంలో సైతం వాహనాలు తడిచి పాడైపోతున్నాయని వారు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి షెడ్ ఏర్పాటు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.