బెల్లంపల్లి డివిజన్లోని బెల్లంపల్లి మండలం కన్నాల ప్రాంతం నుంచి కాసిపేట మండలం బుగ్గగూడం వైపు పెద్ద పులి ఆనవాళ్లకు తోడు ప్రత్యక్షంగా తాము చూశామంటూ కొందరు పేర్కొంటున్నారు. దీంతో మొదట పెద్ద పులి పాదముద్రలను గుర్తించిన అధికారులు.. రెండు రోజుల క్రితం చిరుత పాదముద్రలు సైతం గుర్తించారు. దీంతో ఈ ప్రాంతంలో రెండు వన్యమృగాలు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు సోమవారం ధ్రువీకరించారు.