బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను నెరడిగొండ మండలంలోని రాంపూర్, పీచర గ్రామస్తులు శనివారం కలిశారు. ఈ సందర్భంగా గ్రామాలలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని, అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మండల నాయకులు తదితరులున్నారు.