సకాలంలో పశువులు, మేకలు, గొర్రెలకు వ్యాధి నిరోధక టీకా వేసి పశువ్యాధుల నిర్మూలనకు అందరూ కృషి చేయాలని పశుసంవర్ధక శాఖ సిబ్బంది చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఇచ్చోడ మండలం దాబా (బి) గ్రామంలో పాడి పశువులు టీకాలు వేశారు. గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు ఉచితంగా వేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది సిడం దేవ రావు, రైతులు పాల్గొన్నారు.