సిరికొండ: 4 కేజీల గంజాయి పట్టివేత

80చూసినవారు
సిరికొండ: 4 కేజీల గంజాయి పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గురువారం పట్టుకున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పద రీతిలో వ్యక్తి కనిపించాడని, దీంతో అతనిని పట్టుకొని విచారించాగా సిరికొండ మండలం సోంపల్లి గ్రామానికి చెందిన మాధవ్ అని తెలిపారు. అతని సంచి తనిఖీ చేయగా రూ. లక్ష విలువైన 4 కేజీల గంజాయి లభించిందన్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్