మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి పులిమడుగు గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐతరాజు (24) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ర్యాలీ ఘడ్ పూర్ కు చెందిన రాజు, కళ్యాణ్, ప్రభాస్ బైక్ పై వస్తుండగా ఫ్లై ఓవర్ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. రాజు మృతిచెందగా గాయపడిన ఇద్దరిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.