దండేపల్లి మండలంలోని ముత్యంపేట పెట్రోల్ బంకు సమీపంలో గురువారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో కారు స్వల్పంగా ఆటోకు తగిలింది. దీంతో ఆటో పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లి ఒడ్డున ఆగిపోయింది. కారు పక్కనున్న పంచర్ కొట్టును ఢీ కొట్టి ఆగిపోయింది. కాగా ప్రమాదంలో ఒకరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.