మంచిర్యాల జిల్లాలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం గల ప్రైవేట్ పాఠశాలలు 2025-26 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలల ఎంపికకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు రవీంద్ర రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన పాఠశాలలలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పథకంతో ప్రవేశం పొందిన విద్యార్థులకు 5వ తరగతి విద్యార్థులకు రూ. 42 వేలు ఉపకార వేతనం ఉంటుందన్నారు.