మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలో నూతనంగా నిర్మిస్తున్న జడ్పీ హైస్కూల్, జూనియర్ కళాశాలలో సదుపాయాల కల్పనకు, అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ మీటింగ్ హాల్ లో సమావేశం నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ తో కలిసి జిల్లా ఇంటర్మీడియట్, విద్యాశాఖల అధికారులు, సంబంధిత ప్రిన్సిపాళ్ళతో సమీక్షించారు.