మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో మంగళవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న మృతుడి ఆచూకీ గుర్తించినట్లు జిఆర్ పి ఎస్ఐ మహేందర్ బుధవారం తెలిపారు. శ్రీరాంపూర్ కు చెందిన భోగి అఖిల్ (32) ఎంబీఏ పూర్తి చేసిన ఉద్యోగం రాలేదు. దీనికి తోడు కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమవుతుండడంతో మనస్థాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.