తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ సోమవారం రాత్రి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కె. సి వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు ఇంచార్జ్ ఆత్రం సుగుణక్కను టీపీసీసీ ఉపాధ్యక్షురాలుగా నియమించారు. ఈ సందర్బంగా జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానానికి సుగుణక్క కృతజ్ఞతలు తెలిపారు.