చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామపంచాయితికి తేదీ 01-02-2019 నుండి 31-03-2024 తేదీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇతర ప్రత్యేక నిధుల ద్వారా మంజూరైన మొత్తం నిధులు, ఖర్చు పెట్టిన నిధుల వివరాలు కోరుతూ శుక్రవారం కార్యదర్శి కాటవేణి క్రిష్ణ యాదవ్ కు డబ్బా గ్రామపంచాయితీ పరిధిలోని డబ్బా, బారేగూడా, ధరంపల్లి గ్రామాల బాధ్యతగల పౌరులు, గ్రామస్తులు సమాచార హక్కు చట్టం 2005 ద్వారా దరఖాస్తు చేయడం జరిగింది.