2025- 26 విద్యా సంవత్సరానికి జర్నలిస్టు పిల్లలకు (ఉచిత విద్య) రాయితీకి సంబంధించి ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ తెలిపారు. శుక్రవారం డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ రమణ చారి ఉత్తర్వులు టీయూడబ్ల్యూజే నాయకులకు అందజేశారు. ఈ నేపథ్యంలో విద్యా శాఖ జిల్లా అధికారి యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారన్నారు.