సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

84చూసినవారు
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
కాగజ్‌నగర్‌ పట్టణంలోని వివేకానంద జూనియర్ కళాశాలలో శనివారం పట్టణ పోలీసులు సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పట్టణ సీఐ టి. శంకరయ్య ఆధ్వర్యంలో ఎస్ఐ అంజన్న సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. విద్యార్థులు సెల్ఫోన్లలో వచ్చే అనవసరమైన లింకుల జోలికి వెళ్ళకూడదన్నారు‌. సైబర్ మోసాలపై పోలీసులకు తక్షణమే ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్