కాగజ్‌నగర్ మండలం నవేగాంలో షీటీం ఆధ్వర్యంలో సామాజిక మాధ్యమాలపై మంగళవారం అవగాహన కల్పించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదేశాలానుసారం కార్యక్రమాలు నిర్వహించినట్లు షీ టీం ఇన్ఛార్జ్ ఎస్ఐ సునీత తెలిపారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ వినియోగంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫొటోలు వీడియోలు అప్లోడ్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.