కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం సార్శల గ్రామంలో గురువారం అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ లీడర్ పుల్ల శ్రీకాంత్ మాట్లాడుతూ. బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో డా. బీఆర్ అంబేడ్కర్ను కించపరిచేలా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. దానికి నిరసనగా అమిత్ దిష్టి బొమ్మను దహనం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.