కాగజ్‌నగర్ లో బస్ డిపో ఏర్పాటు చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు అన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో సిర్పూర్ ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. కాగజ్‌నగర్ లో బస్ డిపో ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. డిపో ఏర్పాటుకు కావల్సిన స్థలాన్ని ఇదివరకే చూసి ఉంచామన్నారు.