కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పిఎం గ్రౌండ్ ఎదుట శనివారం వాకర్స్ అసోసియేషన్, యువకుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తమను వాకింగ్ చేసుకోనీయకుండా గ్రౌండ్ లో ఎక్జిబీషన్ ఏర్పాటు చేయడంపై పట్టణవాసుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్న దసరా ఉత్సవాలు. బతుకమ్మ పండుగ ఎస్పీఎం గ్రౌండ్లో జరుగకుండా ఎస్పీఎం యాజమాన్యం కుట్రపన్నుతుందని ఆరోపించారు. వెంటనే ఎక్జిబీషన్ ను వేరే చోటకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.