కాగజ్‌నగర్ అటవీ శాఖ కార్యాలయం ముందు పులి దాడిలో మృతి చెందిన మహిళా మృతదేహంతో కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహిస్తున్నారు. కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మొర్లే లక్ష్మీ శుక్రవారం ఉదయం ఈస్గాం విలేజీ నెంబర్ 11లో పత్తి చెనులో పత్తి ఏరుతుండగా పులి దాడి చేయడంతో మృతిచెందారు. మృతదేహన్ని కాగజ్‌నగర్ డివిజన్ అటవీశాఖ కార్యాలయం ముందు ఉంచి న్యాయం చేయాలని గ్రామస్తులు, నాయకులు ఆందోళన చేపట్టారు.