ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు‌

0చూసినవారు
కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో వనరులు ఉన్నా రోగులకు సేవలు అందడం లేదు. వర్షాకాలంలో తరచూ కరెంటు పోతుండటంతో, ఆసుపత్రిలో జనరేటర్ ఉన్నప్పటికీ దాన్ని ఆన్ చేయకపోవడం వల్ల రోగులు, బాలింతలు చీకట్లో ఉక్కపోతను భరించాల్సి వస్తోంది. రోజుకు పలుమార్లు కరెంటు పోతున్నా, బాధితులను పట్టించుకునే వారు లేరని రోగుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అన్ని వసతులున్నా, ఉపయోగపడకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్