సిర్పూర్ ఉన్నత పాఠశాలలోనే పిల్లలను చేర్పించండి

67చూసినవారు
సిర్పూర్ ఉన్నత పాఠశాలలోనే పిల్లలను చేర్పించండి
పదవ తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించిన సిర్పూర్ ఉన్నత పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉపాధ్యాయులు సిర్పూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఉపాధి హామీలో పనులను చేస్తున్న తలిదండ్రుల దగ్గరకు వెళ్లి బడిబాటను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మోహన్, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్