కాగజ్ గర్: ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

71చూసినవారు
కాగజ్ గర్: ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
కాగజ్ గర్ పట్టణంలో కొత్తపల్లి వెంకటలక్ష్మి చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి 32 మంది హాజరు కాగా వారిలో 22 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. కంటి పరీక్షలకు వచ్చిన వృద్ధులకు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని వైద్యులు డా. కొత్తపల్లి శ్రీనివాస్, అనితలు తెలిపారు.

సంబంధిత పోస్ట్